భారతదేశం, జూన్ 7 -- డబ్బు అవసరాల కోసం ఇప్పుడు చాలా మంది పర్సనల్​ లోన్​వైపు మొగ్గుచూపుతున్నారు. వాటి యాక్సెస్​ కూడా సులభంగా ఉంటోంది. అయితే, చాలా మందికి పర్సనల్​ లోన్​ గురించి పూర్తి వివరాలు తెలియవు. హడావుడిలో తీసుకుని, ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కనీసం కొన్ని కీలక నిబంధనల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే..

1. క్రెడిట్ స్కోర్: పర్సనల్​ లోన్​ కోసం మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు, రుణదాతలు మీ క్రెడిట్ అర్హతను తనిఖీ చేస్తారు. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందో లేదో ఇది చూపిస్తుంది. ఇది 300-900 మధ్య ఉంటుంది. ఇది మీ క్రెడిట్ డేటా ఆధారంగా సీఆర్​ఐఎఫ్​ హై మార్క్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు లెక్కిస్తాయి.

2. ప్రీపేమెంట్: మీరు పర్సనల్​ లోన్​ తీసుకున్నప్పుడు, చివరి గడు...