భారతదేశం, ఆగస్టు 7 -- సాధారణంగా ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లాలంటే జేబులో డబ్బు ఉందా లేదా అని చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది! విహార యాత్రలకు వెళ్లడానికి నాలుగో వంతు మందికి పైగా భారతీయులు పర్సనల్ లోన్​లు తీసుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ దిల్లీ, హైదరాబాద్‌లలో ఎక్కువగా ఉంది.

ఈ సర్వేను పైసాబజార్ సంస్థ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 97 పట్టణాలు, నగరాల్లోని 5,700 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.

"హౌ ఇండియా ట్రావెల్స్ యూజింగ్ హాలిడే లోన్స్ (వాల్యూమ్ 2.0 జులై 2025)" పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నవారి వృత్తి, ఇష్టపడే పర్యాటక ప్రాంతాలు, ఏ నెలలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి అనేక అంశాలను విశ్లేషించారు.

2025 మొదటి ఆరు నెలల్లో.. దాదాపు 27% మంది ట్రిప్​ కోసం పర్సనల్​ లోన్​ తీసుకున...