భారతదేశం, జూన్ 21 -- అప్పులు, ఈఎంఐలు, క్రెడిట్​ పేమెంట్స్​తో ఆర్థిక ఊబిలో కూరుకుపోయారా? అన్ని అప్పులను మేనేజ్​ చేయడం మానసిక ఒత్తిడిని గురిచేసే విషయం. మరి, ఒక పర్సనల్​ లోన్​ తీసుకుని అప్పులన్నీ ఒకేసారి తీర్చేస్తే? ఇది మంచి పరిష్కారమేనా? దీని వల్ల స్వల్ప కాలంలో కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయా? పూర్తి విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్​ కార్డు బిల్లులు, పర్సనల్​ లోన్​, ఈఎంఐలు వంటి అప్పులను ఒక లోన్​గా మార్చి, దానిని నెలవారీగా తీర్చడాన్ని డెట్​ కన్సాలిడేషన్​ అంటారు. సాధారణంగా ఒక పర్సనల్​ లోన్​ తీసుకుని ప్రస్తుత అప్పులను తీర్చేస్తుంటారు. ఫలితంగా అన్ని అప్పులను ట్రాక్​ చేయకుండా, ఒకదానిపై ఫోకస్​ చేసే అవకాశం లభిస్తుంది.

పర్సనల్ లోన్ అనేది ఒక రకమైన అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కాబట్టి మీరు ఎటువంటి హామీ (కొలాటరల్​...