భారతదేశం, అక్టోబర్ 29 -- కార్తీకం చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే, శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం, ప్రత్యేక పూజలు చేయడం వంటివి చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా విశిష్టమైనదే.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణుని కూడా ఆరాధిస్తారు. శివ-కేశవులను కార్తీక పౌర్ణమి నాడు పూజిస్తే, కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు, సిరిసంపదలతో సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు. కార్తీక పౌర్ణమి నాడు, మీ రాశి ప్రకారం ఏ పరిహారాన్ని పాటి...