Hyderabad, ఏప్రిల్ 28 -- పద్మ అవార్డులు 2025 సెర్మనీ సోమవారం (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. ఇందులో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు అజిత్, శేఖర్ కపూర్, అరిజిత్ సింగ్, రిక్కీ కేజ్ లాంటి వాళ్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఇక సింగర్ పంకజ్ ఉధాస్ కు మరణానంతరం ఈ అవార్డు దక్కింది.

పద్మ అవార్డుల కోసం బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రజలను మెప్పించడంతోపాటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలందిస్తున్న ఘనత బాలయ్యది.

దీంతో అతనికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ దక్కింది. ఈ కార్యక్రమానికి అతడు పంచకట్టులో రావడం విశేషం. భార్య వసుంధర, తనయుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేశ్ లతో క...