Hyderabad, జూన్ 24 -- పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ మంగళవారం (జూన్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందు చెప్పినదాని కంటే ఒక వారం ముందే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ కొత్త సీజన్ ఎలా ఉంది? తొలి మూడు సీజన్లలాగే నవ్వించిందా? ఫులేరా ఎన్నికలు ఏమయ్యాయి? పంచాయత్ నాలుగో సీజన్ రివ్యూ ఇక్కడ చూడండి.

పంచాయత్ పేరుతో 2019లో తొలిసారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. చందన్ కుమార్ కథ అందించగా.. దీపక్ కుమార్ మిశ్రా డైరెక్ట్ చేశాడు. మూడు సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరోసారి సచివ్ జీ అభిషేక్ త్రిపాఠీ (జితేంద్ర కుమార్), ప్రధాన్ జీ బ్రిజ్ భూషణ్ (రఘుబీర్ యాదవ్), ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్), ఆఫీస్ అసిస్టెంట్ వికాస్ (చందన్ రాయ్), ప్రధాన్ మంజ...