Hyderabad, ఏప్రిల్ 25 -- సినిమాలు వివాదాస్పదం కావడం, నిషేధాలకు గురవడం సహజమే. అలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం మరీ దారుణం. ఏకంగా ప్రపంచంలోని 100 దేశాలు ఈ సినిమాను నిషేధించాయి. ఇప్పుడు చూడటానికి కూడా ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లోనూ అందుబాటులో లేదు. రిలీజ్ కు ముందే డైరెక్టర్ హత్యకు గురయ్యాడు. ఇంతకీ అంతగా అందులో ఏముంది?

1975లో వచ్చిన ఇటాలియన్ మూవీ సాలో ఆర్ ద 120 డేస్ ఆఫ్ సోడమ్. మార్కీస్ డే సేడ్ రచించిన 120 డేస్ ఆఫ్ సోడొమ్ నవలకు ఇది సినిమా రూపం. పియర్ పౌలో పాసోలిని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను ప్రపంచంలోని ఏ దేశం కూడా స్క్రీనింగ్ కు అనుమతించలేదు. దాదాపు 100 దేశాలు అధికారికంగానో, అనధికారికంగానో నిషేధం విధించాయి.

దీంతో ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద సినిమాగా ఈ సాలో నిలిచింది. నలుగురు ధనికులైన, అవినీతిపరులైన ఇ...