Hyderabad, అక్టోబర్ 13 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన తొలి తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు సూపర్ సుబ్బు. కొన్నాళ్ల కిందట చిన్న టీజర్ తో ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా మరోసారి స్ట్రీమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది. దీనికితోడు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు (Takshakudu) మూవీ కూడా నేరుగా రాబోతోంది.

ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు, నటుడు అయిన ఆనంద్ దేవరకొండ నేరుగా మరో ఓటీటీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ తీసిన డైరెక్టర్ వినోద్ అనంతోజుతోనే ఆనంద్ ఈ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీకి తక్షకుడు అనే ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇందు...