Hyderabad, జూన్ 12 -- ఓ తెలుగు షార్ట్ మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం అందిస్తున్న కథాసుధలో భాగంగా ఈ వారం మరో కొత్త ఎపిసోడ్ రాబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా అన్ని 30 నుంచి 40 నిమిషాల నిడివితో ఉన్న షార్ట్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే.

ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చే ఆదివారం (జూన్ 15) నుంచి సరికొత్త షార్ట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ పేరు ప్రేమంటే ఇది కదా. కథా సుధ సిరీస్ లో భాగంగా వస్తున్న ఈ సరికొత్త ఎపిసోడ్ ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని గురువారం (జూన్ 12) ఈటీవీ విన్ వెల్లడించింది.

"ప్రేమంటే ఇది కదా.. ప్రతి ప్రేమ కథకూ దానికి కావాల్సిన ముగింపు ఉండదు. ఇదో ఎమోషన్లు, హార్ట్ బ్రేక్, అవకాశాల కథ. కథా సుధ నుంచి వస్తోంది. జూన్ 15 నుంచి కేవలం ఈటీవీ విన్ లో.. ఈ ఎమో...