భారతదేశం, మే 10 -- టాలీవుడ్ హీరో నితిన్ నటించిన రాబిన్‍హుడ్ చిత్రం చాలా అంచనాలతో వచ్చి పరాజయం మూటగట్టుకుంది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను సాధించలేకపోయింది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇక రాబిన్‍హుడ్ చిత్రం ఓటీటీతో పాటు టెలికాస్ట్ అయ్యేందుకు కూడా సమయం ఆసన్నమైంది.

రాబిన్‍హుడ్ చిత్రం నేడే (మే 10) జీ5 ఓటీటీలో సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది. నేడు అదే సమయానికి జీ తెలుగు టీవీ ఛానెల్‍లోనూ ప్రసారం కానుంది. "యాక్షన్ ప్యాక్డ్ నైట్‍కు రెడీగా ఉండండి. ఈరోజు నుంచే రాబిన్‍హుడ్ స్ట్రీమింగ్ అవనుంది" అని జీ5 ఓటీటీ నేడు ట్వీట్ చేసింది.

నేడు మే 10 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‍లో రాబిన్‍హుడ్ మూవీ ప్రసారం కానుంది. అదే సమయానికి జీ5 ఓట...