Hyderabad, ఆగస్టు 18 -- టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మరణించిన సరిగ్గా నెల రోజులకు అతని భార్య కూడా తుది శ్వాస విడిచింది. గత నెల 13వ తేదీన కోట మరణించిన విషయం తెలిసిందే. సోమవారం (ఆగస్టు 18) అతని భార్య రుక్మిణి కూడా అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కోట శ్రీనివాస రావు 83 ఏళ్ల వయసులో గత నెల 13న కన్నుమూసిన విషయం తెలిసిందే. తన కెరీర్లో 750కిపైగా సినిమాల్లో నటించిన ఘనత అతనిది. అతని మృతిని మరచిపోక ముందే కోట కుటుంబంలో మరో విషాదం నెలకొంది.

కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురైన అతని భార్య కోట రుక్మిణి సోమవారం తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. వీళ్లిద్దరితో కొన్ని దశాబ్దాల బంధం. అలాంటి నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఇలా ఒకరి వెంట మరొకరు కన్నుమూయడం అభిమానులను కలచి...