భారతదేశం, మే 4 -- తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 28 డిగ్రీ సెల్సియస్ అప్పుడే రెండో ఓటీటీలోకి అడుగుపెట్టింది. మార్చి 4న థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ మూవీకి అనిల్ విశ్వంత్ దర్శకత్వం వహించారు. గత వారమే ఓ ఓటీటీలోకి వచ్చిన ఈ 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఇప్పుడు మరో ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది.

28 డిగ్రీ సెల్సియస్ సినిమా నేడు (మే 4) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. మరో ఐదు రోజుల్లోనే నేడు ఈటీవీ విన్‍లోనూ ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

శరీరంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లేకపోతే హీరోయిన్ ప్రాణానికే డేంజర్ అనే విభిన్నమైన స్టోరీ పాయింట్‍తో ఈ మూవీ తెరకెక్కింది. ల...