భారతదేశం, జూలై 22 -- యాపిల్​ తన ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈసారి నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. అవి.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, సరికొత్త- యాపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్‌గా చెబుతున్న ఐఫోన్ 17 ఎయిర్. ఐఫోన్ 17కు చెందిన లెన్స్ ప్రొటెక్షన్ కవర్ల చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రతి మోడల్‌లో డిజైన్, ప్రాసెసింగ్ పవర్, స్క్రీన్ టెక్నాలజీ, కెమెరా పనితీరులో గణనీయమైన అప్​గ్రేడ్స్​ ఉంటాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 17 లాంచ్​ టైమ్​లైన్​, ధరలు (అంచనా) వంటి వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నివేదికల ప్రకారం.. యాపిల్ కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది సాధారణంగా యాపిల్ కొత్త ఐఫోన్‌లను విడుదల చే...