భారతదేశం, జూన్ 4 -- ఒక దిల్లీ ఆటో డ్రైవర్ నెలకు రూ .5-8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది ఐటీ ఉద్యోగులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా సాధించడానికి కష్టపడే ఫిగర్​! అది కూడా తన ఆటోను నడపకుండానే అని చెబితే మీరు నమ్మగలరా? ఈ ఆటో డ్రైవర్​ ఎలాంటి ఫండింగ్​, యాప్​, ఫ్యాన్సీ టెక్నాలజీ లేకుండానే ఒక అద్భుతమైన ఆలోచనతో ఇదంతా సాధిస్తున్నాడు. యూఎస్​ కాన్సులేట్​ బయట ఉండే ఈయన.. అపాయిట్​మెంట్ల కోసం లోపలికి వెళ్లే వారి లగేజ్​ని తన వాహనంలో ఉంచుకోవడం ద్వారా ఇంత డబ్బును సంపాదిస్తున్నాడట. ఈ విషయాన్ని లెన్స్​కార్ట్ ప్రొడక్ట్ లీడర్, అనుభవజ్ఞుడైన పారిశ్రామికవేత్త రాహుల్ రూపానీ ఈ లింక్డ్​ఇన్​లో తెలిపారు. వీసా అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నప్పుడు రూపానీ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

"నేను నా బ్యాగును లోపలికి తీసుకెళ్లలేనని సెక్యూరిటీ నాకు చెప్పారు. లాకర్లు లేద...