భారతదేశం, జూన్ 2 -- అమెరికా వీధులు మళ్లీ నెత్తురోడాయి. వారాంతంలో మూడు చోట్ల కాల్పుల మోత మోగింది! ఆయా ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 15మంది గాయపడ్డారు.

వర్జీనియాలోని డాన్ విల్లేలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి.

నార్త్ కరోలినా సరిహద్దు సమీపంలోని ప్రైవేట్ ప్రాపర్టీలో తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని డాన్విల్లే పోలీస్ డిపార్ట్​మెంట్ తెలిపింది.

అక్కడికి చేరుకున్న అధికారులు రోడ్డు మధ్యలో నిలిపి ఉంచిన క్రిస్లర్ సెడాన్ కారులో శరీరం పైభాగంలో తుపాకీ గాయంతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించారు. వర్జీనియాలోని హర్ట్​కు చెందిన జే షాన్ టైజే వైట్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

క్రిస్లర్ డ్రైవర్​గా భావిస్తున్న మరో వ్యక్తి తుపాకీ గాయాలతో సమీపంలో కనిపించడంతో అతడిన...