Hyderabad, జూలై 9 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంచలన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వెన్స్‌డే' తిరిగి వచ్చేసింది. జెన్నా ఒర్టెగా టైటిల్ పాత్రలో నటించిన ఈ హిట్ షో రెండో సీజన్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈసారి కథానాయికకు ఎలాంటి విచిత్రమైన, చీకటి మలుపులు ఎదురవుతాయో అందులో చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వెన్స్‌డే సీజన్ 2 ట్రైలర్ ఈ సీజన్ ప్రధాన కథాంశం ఏమిటనే దానిపై ఒక చిన్న హింట్ ఇచ్చింది. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్స్ వెల్లడించిన ఆ ఓటీటీ బుధవారం (జులై 9) ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లోని ఒక సీన్ లో వెన్స్‌డే కళ్ళ నుండి నల్లటి కన్నీళ్లు కారుతూ కనిపిస్త...