Hyderabad, ఆగస్టు 25 -- నెట్‌ఫ్లిక్స్ మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గురించి ఈ మధ్యే ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. సోమవారం (ఆగస్టు 25) ట్రైలర్ రిలీజ్ చేసింది. బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ ను పోలి ఉండే కార్ల్ భోజ్‌రాజ్ పాత్ర చుట్టూ తిరిగే సినిమా ఇది.

మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇన్‌స్పెక్టర్ జెండె (Inspector Zende). ఇదొక సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. ఇది ఫన్నీగా సాగిపోయింది. ట్రైలర్ మొదట్లోనే నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన సినిమాగా చెబుతారు. ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ కార్ల్ భోజ్‌రాజ్ తీహార్ జైలు నుంచి తప్పించుకున్నట్లుగా చూపిస్తారు. 32 హత్యలు చేసిన అతడు ...