Hyderabad, జూన్ 10 -- నెట్‌ఫ్లిక్స్ తన సూపర్ హిట్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్ ను గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ తన బృందంతో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 3తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈ మధ్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరిగి షోలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, సల్మాన్ ఖాన్ అతిథులలో ఒకరిగా వస్తారని వెల్లడించారు. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ కూడా తాను షోలో కనిపించనున్నట్లు ధృవీకరించాడు.

క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సోమవారం (జూన్ 9) తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సెట్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కపిల్ శర్మలతో కలిసి పోజులిచ్చిన చిత్రాలను పంచుకున్నాడు. ఒక ఫొటోలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, క్రికెటర్లు రిషబ్ పంత్, అభిషేక్ శర్మ కూడా చహల్, ...