భారతదేశం, ఫిబ్రవరి 4 -- నెట్‌ఫ్లిక్స్ లోనూ ధురంధర్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు.. వచ్చీ రాగానే ఎగబడి చూస్తున్నారు. దీంతో మూడు రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ తో నాన్ ఇంగ్లిష్ సినిమాల కేటగిరీలో గ్లోబల్ లెవెల్లో నంబర్ వన్ సినిమాగా నిలిచింది.

ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి మూడు రోజుల్లో అంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ సినిమాకు ఏకంగా 7.6 మిలియన్ అంటే 76 లక్షల వ్యూస్ వచ్చాయి. గ్లోబల్ లెవెల్లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో నంబర్ వన్ సినిమాగా ట్రెండింగ్ లో ఉంది.

ధురంధర్ మూవీ ఇండియా సహా ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. వీటిలో పాకిస్థాన్ కూడా ఒకటి...