Hyderabad, జూలై 17 -- నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రతీక్ గాంధీ నటించిన తాజా వెబ్ సిరీస్ 'సారే జహాన్ సే అచ్చా' విడుదల తేదీని ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన కొత్త డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రధాన నటుడు ప్రతీక్ గాంధీ కీలక పాత్రలో కనిపిస్తూ కాస్త డిఫరెంట్ గా ఈ డేట్ అనౌన్స్ చేశారు. ఈ స్పై డ్రామా వచ్చే నెల ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.

'సారే జహాన్ సే అచ్చా' ఆగస్ట్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు మేకర్స్ ప్రతీక్ గాంధీతో కూడిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను గురువారం (జులై 17) విడుదల చేశారు. ఇందులో అతడు గూఢచారి అధికారి విష్ణు శంకర్‌గా కనిపించాడు. మోర్స్ కోడ్‌లో సమాచారాన్ని సేకరిస్తుంటాడు. ఒక గూఢచారికి ప్రతి సమాచారం ఎంత ముఖ్యమన్నది వివరిస్తాడు.

"మా మిషన్ విజయం లేదా వైఫల్యం దానిపై ...