Hyderabad, జూలై 15 -- థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం మరో సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు మండల మర్డర్స్ (Mandala Murders). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఒరిజినల్ సిరీస్ ను తీసుకొస్తోంది. గతంలోనే సిరీస్ అనౌన్స్ చేయగా.. తాజాగా మంగళవారం (జులై 15) ట్రైలర్ రిలీజ్ చేసింది.

మండల మర్డర్స్ ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి మోల్ చుకానా పడేగా (మూల్యం చెల్లించాల్సిందే) అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇది మనల్ని ఓ మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చరణ్‌దాస్‌పూర్ అనే అడవి నుంచి ట్రైలర్ మొదలైంది. అది అడవి కాదు ఓ ప్రాచీన కాలపు యంత్రం అని, అందులో ఎవరైనా తమ బొటన వేలు త్యాగం చేసి కోరుకున్న వరం పొందవచ్చని వాయిస్ ఓవర్ ...