Hyderabad, జూలై 16 -- నితిన్ కొత్త మూవీ 'తమ్ముడు' బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దిల్ రాజు రూ.40 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మూడు రోజులు కూడా నిలవలేకపోయింది. శ్రీరామ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నితిన్ ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగింది. ఇప్పుడీ మూవీ నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమ్ముడు మూవీ జులై 4న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కొన్ని రోజులుగా బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజా ఈ మూవీ ఆగస్ట్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

అంటే సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో ర...