Hyderabad, సెప్టెంబర్ 25 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి శుక్రవారం (సెప్టెంబర్ 26) రెండు డిజాస్టర్ సినిమాలు వస్తున్నాయి. ఇవి రెండూ బాలీవుడ్ సినిమాలే. అంతేకాదు ఆ రెండు సక్సెస్‌ఫుల్ మూవీస్ కి సీక్వెల్స్ కూడా కావడం విశేషం. మరి ఆ సినిమాలేవి? వాటి ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలేంటి అన్నది తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్ లోకొ ఒకే రోజు అంటే ఈ శుక్రవారం రాబోతున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి సన్ ఆఫ్ సర్దార్ 2 కాగా.. మరొకటి దడక్ 2. ఈ రెండు సినిమా స్ట్రీమింగ్ తేదీలను గురువారం (సెప్టెంబర్ 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. "సైలెంట్‌గా ఉండు పుత్తర్.. సర్దార్ ఎంట్రీ కాబోతోంది. సన్ ఆఫ్ సర్దార్ 2 సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయం తెలిపింది.

ఇక అంతకుముందే దడక్ 2 మూవీ కూడా రాబోతున్నట్లు చెప్ప...