భారతదేశం, మే 13 -- 'జువెల్ తీఫ్ - ది హీస్ట్ బిగిన్స్' చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన ఈ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. విలువైన వజ్రం చోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్‍కు వచ్చాక ఈ మూవీకి ఎక్కువ శాతం నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ వ్యూస్‍లో మాత్రం జువెల్ తీఫ్ అదరగొట్టింది.

జువెల్ తీఫ్ మూవీ నెగెటివ్ రెస్పాన్స్ దాటుకొని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. సైఫ్ లాంటి స్టార్ ఉండడం, ఐదు భాషల్లో నేరుగా ఓటీటీలోకే రావడం, ఈ మూవీ ఆరంభం నుంచి సత్తాచాటింది.

జువెల్ తీఫ్ చిత్రం మొదటి ను...