భారతదేశం, జూన్ 13 -- నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13, 2025న ఓపెన్​ చేయనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్​కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​లో లింక్​ని పొందొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లింక్ యాక్టివేట్ అవుతుంది.

నీట్​ పీజీ 2025 ఎగ్జామ్​ సీటీని ఎంచుకునేందుకు చివరి తేదీ జూన్ 17, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్​లైన్​ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థులు టెస్టింగ్ సీట్లు అందుబాటులో ఉన్న నగరాలను మాత్రమే చూడగలరు. ఎంచుకున్న ఎగ్జామ్ సిటీలో వేదిక కేటాయింపు ఎన్బీఈఎంఎస్ ద్వారా జరుగుతుంది. అడ్మిట్ కార్డుల ద్వారా కచ్చితమైన పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులకు...