భారతదేశం, సెప్టెంబర్ 1 -- బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమైన సమాచారం! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ "ఏ"- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ "బీ"- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్​ ప్రక్రియను సైతం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్, పీఓ 2025 దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు నవంబర్/డిసెంబర్‌లో విడుదల అవుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్/డిసెంబర్ 2025ల...