భారతదేశం, ఏప్రిల్ 25 -- మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్చి 2025 తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ క్యూ 4 లో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 1 శాతం క్షీణించి రూ.3911 కోట్లకు పరిమితమైంది.

2025 జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతి సుజుకి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3911 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ సాధించిన నికర లాభం రూ.3952 కోట్లతో పోలిస్తే 1 శాతం తక్కువ. కార్యకలాపాల ద్వారా మారుతి సుజుకి ఆదాయం రూ.40,920.1 కోట్లు. ఇది గత సంవత్సరం ఇదే క్యూ 4 లో మారుతి సుజుకీ కార్యకలాపాల ద్వారా పొందిన ఆదాయం రూ.38,471.2 తో పోలిస్తే 6.6 శాతం అధికం. అలాగే, జనవరి - మార్చి 2025 త్రైమాసికంలో మారుతి సుజుకి అమ్మకాల పరిమాణం 604,635 యూనిట్లుగా నమోదైంది. ఇది గత క్యూ 4 తో పోలిస్తే 3.5% పెరిగ...