భారతదేశం, సెప్టెంబర్ 14 -- ప్రపంచవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నాయి! కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలో ఈ తరహా ఆందోళనలు జరగ్గా.. తాజాగా యూకే వీధులు నిరసనలతో మారుమోగిపోయాయి. ఫార్-రైట్ వింగ్​ కార్యకర్త టామీ రాబిన్సన్ లండన్‌లో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. సుమారు 1,10,000 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో కొంతమంది మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. "యూనైట్ ది కింగ్‌డమ్" ర్యాలీలోని కొందరు అల్లరిమూకలు పోలీసులను పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం, అలాగే బాటిళ్లతో దాడి చేయడంతో అనేకమంది అధికారులు గాయపడ్డారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హెల్మెట్లు, అల్లర్ల నిరోధక కవచాలు ధరించిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.

ఈ ఘటనలో మొత్తం 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి పళ్లు ఊడిపోవ...