భారతదేశం, ఫిబ్రవరి 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు అమ్మి మరి ముష్టివాళ్లకు చికెన్ వండిపెడుతుంది శ్రుతి. మా పుట్టింటివాళ్లు పెట్టిన బిందెలు అమ్మేసిందని సరోజా ఫీల్ అవుతుంది. గల్లాపెట్టె దగ్గర కూర్చోనివ్వలేదని నా ఇల్లు గుల్ల చేస్తావా? అని శ్రుతిని అడుగుతుంది సరోజా.

అప్పులవాళ్లను కూడా శ్రుతి పిలుస్తుంది. ఎంత మంచిదానివి చెల్లి, చాలా సంతోషంగా ఉంది బావ అని అప్పులవాళ్లు అంటారు. సరోజా కొంగున కట్టుకున్న డబ్బులను ఇచ్చేస్తుంది. మరోవైపు పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లారు కదా ఏమైందని చంద్రకళను అడుగుతాడు విరాట్. పాప కోలుకుంటుందని చంద్ర చెప్తుంది. ఈ మాటలను విన్న శాలిని.. ఈ పాయింట్ ను వాడుకుని మీ ఇద్దరితో ఎలా ఆడుకుంటానో వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటుంది.

క్రాంతి రెడీ కాకుండా వర్క్ చేసుకుంటాడు. పూజకు టైమ్ అవుత...