భారతదేశం, ఫిబ్రవరి 4 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ లో తేజు అమ్మానాన్నగా చంద్రకళ, అర్జున్ ను చూసి శాలిని షాక్ అవుతుంది. చంద్రను అమ్మ, అర్జున్ ను నాన్న అని తేజు పిలవడం చూస్తుంది. అర్జున్ కు కూతురు ఉందా? తను చంద్రను అమ్మ అంటుందేంటీ? నాకు తెలియని సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలని శాలిని అనుకుంటుంది.

శాలిని డాక్టర్ గెటప్ వేసుకుని లోపలికి వెళ్తుంది. వాళ్ల అమ్మ వచ్చినప్పటి నుంచి తేజు రికవర్ అవుతున్నట్లు కనిపిస్తోందని అర్జున్ అంటాడు. మా అమ్మ నాతో ఎక్కువ సేపు ఉండట్లేదు. అమెరికా నుంచి వచ్చింది. జాబ్ అంటూ ఈవెనింగ్ వెళ్లిపోతుంది. అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నానని డాక్టర్ తో తేజు చెప్తుంది.

తన తల్లి చనిపోతుందని తెలిస్తే నీ కూతురు ఏమైపోతుందేమోనని అమెరికాలో ఉందని చెప్పావు. ఇప్పుడు తల్లిలా వచ్చి ఈవిడ (చంద్రకళ) తేజును బతికిస్తోంది. ప...