భారతదేశం, ఫిబ్రవరి 3 -- నిన్ను కోరి టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో క్రాంతికి మళ్లీ నా మీద నెగెటివ్ ఇంప్రెషన్ రాకుండా చూసుకోవాలని చంద్రతో విరాట్ అంటాడు. కింద పడ్డ ఫైల్స్ తీయబోతూ చంద్ర, విరాట్ తలలు ఢీకొట్టుకుంటారు. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి ఇంకోసారి రిపీట్ చేయాలని విరాట్ ను గుద్దుతుంది చంద్ర.

డోర్ బయటే ఉన్న శ్యామల విరాట్ ను పిలుస్తుంది. లోపల మీరిద్దరు ఏదో మాట్లాకుంటున్నారు. భూమి పూజకు ఎల్లుండి బాగుంది. గొడవలు పడితే పడ్డారు కానీ చిన్నపిల్లల్లా కొట్టుకోకండని చెప్పి శ్యామల వెళ్లిపోతుంది. ఫోన్లో చూస్తూ తేజు చెప్పినట్లుగా అర్జున్ వంట చేస్తాడు. అప్పుడే చంద్ర వస్తుంది.

స్టవ్ వెలిగించకుండానే వంట చేస్తున్నారని చంద్ర చెప్తుంది. పాప కోసం నేనే వంట చేస్తానని చంద్రకళ అంటుంది. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని అర్జున్ అంటాడు. ఈ రోజు పాపను స్పెషలిస్ట్...