భారతదేశం, ఫిబ్రవరి 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫోన్ చేసిన వెంటనే ఫైల్ పంపించకుండా మమ్మల్ని అంటే ఎలా అని క్రాంతిపైనే రివర్స్ అవుతుంది మంత్రి పీఏ. అదే విషయం శాలినికి చెబుతాడు క్రాంతి. అన్నయ్యకు పీఏ కాల్ చేసి ఫైల్ పంపించమన్నారట. కానీ, అన్నయ్య నాకు చెప్పనేలేదు అని క్రాంతి అంటాడు.

మన పని మీద వేరేవాళ్లకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటది. అందుకే మీ అన్నయ్య మీద డిపెండ్ కావొద్దనంటున్నా అని ఎక్కిస్తుంది శాలిని. ఇంత పెద్ద విషయం అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదో ఇప్పుడే అడుగుతా అని క్రాంతి అంటాడు. ఈ మంట చాలు సంతోషం ఆవిరి అవ్వడానికి అని శాలిని అనుకుంటుంది.

విరాట్‌ను అంతా పొగుడుతారు. క్రాంతి కూడా కంగ్రాట్స్ చెబుతాడు. దాంతో శాలిని షాక్ అవుతుంది. సొంత తమ్ముడికి ఇచ్చిన మాటను ఈజీగా మర్చిపోతావ్ అని క్రాంతి అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఆ బాంబే కాంట్రా...