భారతదేశం, జనవరి 31 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ కోసం విరాట్ తెచ్చిన మల్లెపూలను సోఫాలో చూస్తాడు రఘురాం. నీకోసమేగా వీడు పూలు కొన్నది అని రఘురాం అంటాడు. దాంతో డైనింగ్ టేబుల్‌పై ఉన్న గ్లాస్ కింద పడేస్తుంది చంద్రకళ. దాంతో జరిగింది మర్చిపోతాడు రఘురాం. ఇంతలో అంతా వస్తారు. చేతిలో మల్లెపూలు ఏంటని శ్యామల అడుగుతుంది.

జగదీశ్వరి కోసమే రఘురాం మల్లెపూలు కొన్నాడని కామాక్షి అంటుంది. కానీ, శాలినికి మాత్రం చంద్ర కోసం విరాట్ పూలు కొన్నాడని, మావయ్య మతిమరుపుతో డైవర్ట్ చేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది శాలిని. నీకోసం అప్పుడప్పుడు ఇలాగే పూలు తెచ్చేవాడిని కదా అని రఘురాం అంటే సిగ్గుందా అండి. పిల్లల ముందు అలా అంటారేంటీ అని జగదీశ్వరి అంటుంది.

అయితే రూమ్‌లో అను అన్నయ్య అని రఘురాం, జగదీశ్వరిని గదిలోకి పంపించేస్తారు శ్యామల, కామాక్షి. ప్రకాష్ ఉండుంటే...