భారతదేశం, మే 3 -- తెలుగు కామెడీ యాక్షన్ మూవీ 'రాబిన్‍హుడ్'కు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ రాబిన్‍హుడ్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. అదే సమయానికి ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి.

రాబిన్‍హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయంపై జీ తెలుగు నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే వచ్చే శనివారం మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ కానుంది.

జీ నెట్‍వర్క్ ఇటీవల కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. చిత్రాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఒకేసారి తెస్...