భారతదేశం, ఫిబ్రవరి 2 -- టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 2) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారని అడిగితే తన తమ్ముడు బాగా సంపాదించడం వల్లే తనకు ఈ రెస్ట్ దొరికిందని అనడం విశేషం.

సంతోష్ శోభన్, మానస వారణాసి లీడ్ రోల్స్ లో నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మూవీపై సంతోష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పాడు. ఇక డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ గురించి మాట్లాడుతూ.. ఎన్నో మంచి సినిమాలు అతని నుంచి రానున్నాయని, అందులో ఇది మొదటిదని చెప్పాడు. హీరోయిన్ మానస వారణాసిపైనా సంతోష్ ప్రశంసలు కురిపిం...