భారతదేశం, ఫిబ్రవరి 24 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని సార్లు మాత్రం అశుభ ఫలితాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శని నెమ్మదిగా కదిలే గ్రహం. పైగా శని తన ఫలితాలను మనం చేసే కర్మలను బట్టి ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శని నక్షత్ర సంచారంలో మార్పు రానుంది. శని ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 17, శుక్రవారం సాయంత్రం 4:05కి శని ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాద...