Hyderabad, జూలై 10 -- నరివెట్ట అంటే తెలుగులో నక్కల వేట అని అర్థం. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం, దానిని అణచివేయడానికి అప్పటి ప్రభుత్వం, పోలీసులు చేసిన దారుణాలను కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ ఏడాది మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. గురువారం (జులై 10) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మూవీ: నరివెట్ట

ఓటీటీ: సోనీ లివ్

డైరెక్టర్: అనురాజ్ మనోహర్

నటీనటులు: టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ తదితరులు

స్టోరీ: 2003లో కేరళలో జరిగిన ముత్తాంగ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నరివెట్ట మూవీని అనురాజ్ మనోహర్ తెరకెక్కించాడు. కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించి అతడు పెద్ద సాహసమే చేశాడు. 2003, ఫిబ్రవరి 19న తమకు ప్రభుత్వం ఇస్తామన్న భూముల కోసం పోరాటం చేస్...