భారతదేశం, జూలై 19 -- "ఎప్పటికైనా ఈ ఉద్యోగాలు మానేసి లైఫ్​లో సెటిల్​ అవ్వాలి." ఇది.. నెలవారీ జీతంతో జీవితాన్ని వెళ్లదీసే మధ్యతరగతి కుటుంబాల కల. దీని కోసం రూ.1కోటి సంపాదించాలని, సేవింగ్స్​ని ఇన్వెస్ట్​మెంట్స్​ని లెక్కలేసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒక నమ్మలేని నిజాన్ని తెలుసుకోవాలి! రూ.1కోటి అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం. కానీ నేటి ప్రపంచంలో రూ. 1కోటి సరిపోదు! "ఎందుకు సరిపోదు? సరిపోతుంది" అని మీరు అనుకుంటుంటే మాత్రం ఒక్కసారి ఈ ఆర్టికల్​ని పూర్తిగా చదవండి..

1. ద్రవ్యోల్బణం మీ డబ్బును ఊహించిన దానికంటే వేగంగా తినేస్తోంది:

2000 దశకం ప్రారంభంలో, రూ. 1 కోటితో ఒక ఇల్లు, కారు కొని, ఇంకా మిగిలిన డబ్బుతో ఎఫ్‌డీ వడ్డీతో కుటుంబాన్ని పోషించుకునే వీలుండేది. కానీ ఇప్పుడు అలా కాదు! బెంగళూరు లేదా ముంబై వంటి నగరంలో, రూ. 1కోటితో ఒక మంచి 2బీహెచ్​కే ఇల్లు కూడా ర...