భారతదేశం, జనవరి 31 -- తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలలో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)తో నడుస్తున్న ఈ జన నాయగన్ పోరాటంపై దళపతి విజయ్ తాజాగా స్పందించారు. ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. 'జన నాయకన్' చిత్రం సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడుతుండటంపై విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

"నా వల్ల నా నిర్మాత (KVN ప్రొడక్షన్స్) ఇబ్బందులు పడటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే, నా సినిమాలను టార్...