భారతదేశం, మే 13 -- ఫేక్ డాక్టర్లను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి పంపాల్సిన పోలీసులు వారితో బేరం కుదుర్చుకున్నారు. లంచం డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు సూర్యాపేట డిఎస్పీ, సీఐలను పట్టుకున్నారు.

సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరో ధక శాఖ అధికారులకు చిక్కారు. సూర్యాపేటలోని రెండు ప్రైవేటు హాస్పటల్స్‌తో పాటు ఒక స్కానింగ్ సెంటర్‌ను నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఏర్పాటు చేసినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఏప్రిల్‌ 23న ఫిర్యాదు చేశారు.

ఐఎంఏ ఫిర్యాదుతో సూర్యాపేట టూటౌన్‌లో ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేశారు. స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండుకు తరలించకుండా ఉండాలంటే సూర్యాపేట డీఎస్పీ పార్థసారథితో మాట్లాడుకోవాలని ముగ...