భారతదేశం, జనవరి 25 -- నంద్యాల జిల్లాలోని ఢోన్ రైల్వే స్టేషన్ లో ఆదివారం తెల్లవారుజామున గన్ మిస్ ఫైర్ అయింది. సర్వీస్ వెపన్ ను డిపాజిట్ చేస్తుండగా 50 ఏళ్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కానిస్టేబుల్ పి పెద్దయ్య ఎస్కార్ట్ డ్యూటీ పూర్తి చేసిన తర్వాత రైలు దిగాడు. ఎస్కార్ట్ డ్యూటీ తర్వాత ఆయుధాన్ని డిపాజిట్ చేస్తున్నప్పుడు తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. బుల్లెట్ ముఖానికి తాకటంతో అక్కడికక్కడే మరణించాడని ఓ అధికారి పీటీఐకి తెలిపారు.

కానిస్టేబుల్ కుటుంబం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉంటున్నట్లు సదరు అధికారి తెలిపారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మృతదేహాన్ని చూసి పెద్దయ్య భ...