భారతదేశం, అక్టోబర్ 14 -- ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్​, విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్​ దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది! అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక భయానక వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఈ దుర్ఘటనకు సంబంధించి వైరల్​ అయిన వీడియోలో.. దాద్రీ ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. అయితే, ట్రాక్ దాటుతుండగా అతడి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. అతను కూడా కింద పడిపోయాడు.

అందిన సమాచారం ప్రకారం, రైల్వే క్రాసింగ్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ తుషార్ దానిని దాటేందుకు ప్రయత్నించాడు. బైక్ పడిపోవడంతో, దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, రైలు దగ్గరికి వస్తున్న విషయాన్ని గమనించి...