భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ లో క్రేజీ సినిమాలున్నాయి. పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను కొనసాగించేలా అతను మూవీస్ చేస్తున్నాడు. అయితే ధురంధర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆదిత్య ధర్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సింది. కానీ ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. రీజన్ ఏంటో చూద్దాం.

పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ వేరే లెవల్ కు వెళ్లింది. అయితే ధురంధర్ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ అల్లు అర్జున్ కు మిస్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో పురాణాల్లోని మరణం లేని అశ్వత్థామ క్యారెక్టర్ ఆధారంగా ఓ సినిమా చేయాలని మేకర్స్ ప్లాన్ వేశారనే వార్త వైరల్ గా మారింది.

అల్లు అర్జున్-ఆదిత్య ధర్ కాంబినేషన్లో సినిమా కోసం విశ...