భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇటీవల తరుచుగా వార్తల్లో వినిపిస్తున్న జోడీ.. మృణాల్ ఠాకూర్, ధనుష్. తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ఉందని, డేటింగ్ నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రేమపై, బంధంపై మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

మృణాల్ రీసెంట్ గా 'ఫిల్మీగ్యాన్'తో మాట్లాడుతూ ప్రేమ గురించి చెప్పింది. "ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడాలని నేను భావిస్తా. ఇది మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన విషయాలలో ఒకటి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమను కనుక్కోవాలని నేను ఆశిస్తున్నా'' అని మృణాల్ ఠాకూర్ తెలిపింది.

ప్రేమలో ఉన్న అమ్మాయిలే తమ ప్రియుడు గురించి ఎక్కు...