Hyderabad, సెప్టెంబర్ 1 -- మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించి, కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించిన సూపర్ హీరో మూవీ లోక ఛాప్టర్ 1. ఈ ఫిమేల్ సూపర్ హీరో సినిమా డొమెస్టిక్ మార్కెట్‌లో భారీ రెస్పాన్స్ తో మొదలైంది. సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇది ఇప్పుడు ఓనం రిలీజ్‌లన్నిటినీ దాటేసింది. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల కలెక్షన్లకు చేరువవుతోంది.

కల్యాణి ప్రియదర్శన్, ప్రేమలు ఫేమ్ నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించిన మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోక ఛాప్టర్ 1. sacnilk.com ప్రకారం ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లు వసూలు చేసింది. ఇండియా కంటే విదేశాల్లో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

ఇండియాలో రూ.16.7 కోట్లు రాగా.. ఓవర్సీస్ లో రూ.24.3 కోట్లు రాబట్టింది. కేవలం మలయాళం వెర్షన్ లోనే ఇప్పటి వరకూ రూ.19...