భారతదేశం, ఏప్రిల్ 21 -- నీట్​ యూజీ 2025 అభ్యర్థులకు అలర్ట్​! ఈ దఫా నీట్​ యూజీ పరీక్షకు సంబంధించిన అడ్మిడ్​ కార్డులను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే విడుదల చేయనుంది. 2025 మే 1 నాటికి అడ్మిట్​ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ 2025కు హాజరయ్యే అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్​సైట్ నుంచి తమ హాల్​టికెట్స్​/ అడ్మిట్​ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

నీట్ యూజీ 2025 పరీక్షను మే 4న ఎన్టీఏ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్టులో ఆఫ్​లైన్​లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

అడ్మిట్ కార్డును విడుదల చేయడానికి ముందు, ఎన్టీఏ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను విడుదల చేస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన...