భారతదేశం, జూలై 4 -- ఇటాలియన్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్​లో తన స్పోర్టీ స్కూటర్‌ను త్వరలో అప్‌డేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో తయారు చేసిన మోటార్‌సైకిళ్లపై ఎక్కువగా దృష్టి సారించిన ఏప్రిలియా, ఈ నెలాఖరులో కొత్త ఏప్రిలియా ఎస్​ఆర్​ 175 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. ఎస్​ఆర్​ 175 స్కూటర్​ ప్రస్తుత ఎస్​ఆర్​ 160 స్థానంలో రానుంది. ఇది మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

రాబోయే ఏప్రిలియా ఎస్​ఆర్​ 175 స్కూటర్​.. కొత్త గ్రాఫిక్స్, కలర్​ ఆప్షన్స్​ మినహా ఎస్​ఆర్​ 160కి చాలా పోలి ఉంటుంది. కొత్త కలర్​ థీమ్ బ్రాండ్ ఆర్​ఎస్​ 457, ట్యూనో 457 మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. వీ- ఆకారపు హెడ్‌ల్యాంప్, షార్ప్‌గా డిజై...