భారతదేశం, మే 24 -- అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శిస్తూ.. తోటి సైనికుడిని కాపాడే క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలో గురువారం జరిగింది ఈ ఘటన. నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న ఓ సైనికుడిని సాహసోపేతంగా రక్షించిన లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ.. తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు! లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ వయస్సు 23ఏళ్లు.

గతేడాది డిసెంబర్​లో సిక్కిం స్కౌట్స్​లో చేరారు 23ఏళ్ల లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ. సిక్కింలోని ఓ ఆపరేటింగ్​ బేస్​కి తన టీమ్​తో గురువారం బయలుదేరారు. అక్కడ ఒక్క పోస్టు రెడీ అవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్య అగ్నివీర్​ స్టీఫెన్​ సుబ్బా అనే సైనికుడు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అది గమనించిన లెఫ్టినెంట్​ తివారీ.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే నీటి ప్రవాహంలోకి దూకేశారు. మరో జవాను నాయక్​ పుకార్​ ప...