Hyderabad, అక్టోబర్ 9 -- 'కాంతార చాప్టర్ 1' సినిమా విడుదలైన మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన అద్భుతమైన వసూళ్లు కేవలం ఇండియన్ సినిమాకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లను అధిగమించింది. దీనికి ప్రధానంగా ఇండియాలోలో సాధించిన బలమైన కలెక్షన్లు తోడయ్యాయి. దీంతో హాలీవుడ్‌లోని కొన్ని పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి, విడుదలైన మొదటి వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన 'కాంతార చాప్టర్ 1' ఇండియాలో మొదటి ఏడు రోజుల్లో రూ.379 కోట్ల గ్రాస్ (42 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, గురువారం (అక్టోబర్ 9) నాటికి దాని మొదటి ఎక్స్‌టెండెడ్ వీక్ ముగిసేసరికి.. ఇది 45 మిలియన్ డాలర్లకు ...