Hyderabad, సెప్టెంబర్ 5 -- తెలుగు సినిమా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జీ సినిమాలు 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 'దిల్ పై సూపర్ హిట్' అంటూ సూపర్​ హిట్​ సినిమాలతో అలరించిన జీ సినిమాలు ఇప్పుడు 'విత్​ లవ్​..' అంటూ ప్రేక్షకులను పలకరిస్తోంది.

విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది జీ తెలుగు. జీ సినిమాలు ప్రారంభం నుంచీ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినీ వినోదాన్ని అందిస్తూ కొనసాగుతోంది.

సెప్టెంబర్ 4న తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న జీ సినిమాలు మార్కెట్‌లో ఘనవిజయాలను సాధించింది. మార్కెట్‌లో నాల్గవ ఛానెల్‌గా ప్రారంభమైన జీ సినిమాలు కేవలం తొమ్మిదేళ్లలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్‌గా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో, జీ సినిమాలు 202 రేటింగ్‌...